రాజుపాలెం మండల రైతులకు మైలవరం డ్యామ్ నుంచి నీరు అందించిన ఎమ్మెల్యే రాచమల్లు అని రైతులు చెబుతున్నారు
వరదరాజుల రెడ్డి గారు టిడిపి టికెట్ కోసం రోజుకోక వర్గాన్ని వెంట పెట్టుకొని పొలిటికల్ షో చేసుతున్నారు రాజోలు ఆనకట్ట నుంచి సాగు నీరు సరిపోక పోతే రాజుపాలెం మండల రైతుల కోసం మొట్ట మొదటి సారి మైలవరం డ్యామ్ నుంచి నీరు తీసుకు వస్తున్న ఏకైక ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అని రైతులు చెబుతున్నారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ప్రెస్ తో అన్నారు.
మీరు ఎన్ని కూయుక్తులు చేసిన చంద్రబాబు రైతు వ్యతిరేకి అని ముద్ర చెరిపివేయలేరు అని ఎమ్మెల్యే అన్నారు .
2014 సం లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వలేని సమయంలో మా పార్టీ ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి గారు డిల్లీ కి పలు మార్లు తిరిగి ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించారని ఎమ్మెల్యే రాచమల్లు గుర్తు చేశారు.
25 ఎమ్మెల్యే గా ఉన్న సమయం లో వరద రాజుల రెడ్డి గారు రైతు ల కోసం ప్రత్యేకంగా చేసింది ఏమి లేదని , ఇప్పుదు తండ్రి కొడుకులు రాజకీయ లబ్ధి కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి మీద విమర్శ లు చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.
మొత్తం 6000 ఎకరాల కు గాను 5000 ఎకరాల రైతులకు నీరు అందింస్తున్నామని మిగతా 1000 ఎకరాల రైతులకు భౌగోళిక కారణాల చేత అందించ లేక పోతున్నామని, దీనికి ప్రకృతి కారణం తప్ప ఎమ్మెల్యే గా నేను గాని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గాని కారణం కాదని ఎమ్మెల్యే ప్రెస్ తో చెప్పారు.