చంద్రబాబు మోసగాడు|గతంలో ఇచ్చిన హామీలను ఇచ్చి మోసం చేశాడు| ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి
టిడిపి నాయకుల మాటలు నమ్మకండి, చంద్రబాబు తో సహా అందరూ గతంలో ఎన్నికల సమయం లో ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చలేదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్నారు.
టిడిపి గత ఎన్నికల్లో మనిఫెస్టో ప్రకటించి అధికారం లోకి వచ్చిన తరువాత వెబ్సైటు లో నుంచి తొలగించిన పార్టీ అని ఇటువంటి పార్టీ ఇప్పుడు మళ్ళీ కొన్ని హామీలు ఇస్తూ మీ ఇళ్ల దగ్గరకు టిడిపి నాయకుల ను మీ ఇంటి దగ్గరకు పంపిస్తున్నదని మీరు వారి హామీలని నమ్మి మోస పోవద్దు అని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి చెప్పారు.
వైసీపీ పార్టీ మనిఫెస్టో ను ఒక పవిత్ర గ్రంధం లాగా భావించి ముఖ్యమంత్రి నుంచి మీ వీధిలో ఉండే సంచివాలయ దాకా భావించి పని చేసి మీకు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చడాని కీ ప్రయత్నం చేస్తున్నమని,
రాబోయే ఏప్రిల్ నెలలో ఎన్నికలు రాబోతున్నాయని మీ ఓటు మీ భవిష్యత్తు ను నిర్ణయిస్తుందని కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి చెప్పారు.