బిసిల విషయంలో బహిరంగ చర్చకు సిద్దమా వరదరాజుల రెడ్డి- రాచమల్లు | apnews | Telugu Vartha
ప్రొద్దుటూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజుల రెడ్డి బిసి ల విషయంలో బహిరంగ చర్చ కు సిద్దమా అని ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్నారు. బిసిలకు పదవులు ఇచ్చి పెత్తనం చేసిన వ్యక్తీ వరదరాజుల రెడ్డి అని రాచమల్లు విమర్శ చేశారు, ప్రొద్దుటూరు మండల అధ్యక్షుడు పదవి శేఖర్ యాదవ్ కు ఇచ్చిన తరువాత మేము శేఖర్ కు పూర్తీ స్వేఛ్చ ఇచ్చామని, అలాగే ప్రొద్దుటూరు మున్సిపాలిటీ చైర్మెన్ బిసి మహిళ కు ఇచ్చి ఆమెకు పూర్తి స్వేఛ్చ ఇచ్చామని ఇదే విదంగా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జగనన్న అనుమతి ఇప్పించమని వారి పదవుల ద్వారా వచ్చే అధికారం లో ఎప్పుడు వేలు పెట్టలేదు అని అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినా ప్రతి ఒక్కరికీ స్వేచ్చ ఇచ్చామని ఈ విషయాలే కాకుండా మరి కొన్ని అంశంలా పై టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజుల రెడ్డి గారి తో చర్చ కు సిద్దమని ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్నారు.