ప్రొద్దుటూరులో రాచమల్లు అధ్వర్యంలో ఇఫ్తియర్ విందు | apnews | Proddatur Politics | Telugu Vartha
ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజక వ్యాప్తంగా ఉన్న ముస్లీం సోదరులకు ఇఫ్తియార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాచమల్లు మీడియాతో మాట్లాడుతూ ప్రొద్దుటూరు నియోజక వ్యాప్తంగా ఉన్న ముస్లీం లను ప్రతి ఒక్కరి ని ఈ విందు కు ఆహ్వానం పలకడం జరిగింది అని అన్నారు. తనకు ముస్లీం లంటే ఎనలేని గౌరవం అని వారి పట్ల నేను ఎల్లప్పుడూ వినయ విదేయలతో ఉంటానని వారి దత్తపుత్రుడు వలే భావించి నేను వారి కీ సేవ చేస్తున్నాని తనకు అల్లాహ్ అనుగ్రహం ఉండి. రాబోయే ఎన్నికల్లో గెల్చి జగనన్న ప్రభుత్వం వస్తే ముస్లీం , బిసి , ఎస్సి , ఓసి తదితర వర్గాలకు అన్ని సంక్షేమ ఫలాలతో పాటు తన సొంత నిధులతో ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తుకుంటానని రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్నారు.