వరదరాజుల రెడ్డి ఆర్యవైశ్యులకు డబ్బులు తీసుకోని ఎగరకొట్టాడు-బంగారు రెడ్డి | Proddatur | Telugu Vartha
ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజుల రెడ్డి & కుటుంబ సభ్యులు డబ్బులు అప్పులు తీసుకోని ఎగరకోట్టాడు అని ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మెన్ పాతకోట బంగారు రెడ్డి అన్నారు . గతంలో ప్రతి ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే కీ శే డా.ఎం.వి.రమణారెడ్డి గారిని ఇలాగె బూచి గా చూపించి వరదరాజుల రెడ్డి 5 సార్లు ఎమ్మెల్యే గా గెల్వగల్గినారని ఇప్పుడు కూడా అదే వ్యూహం తో రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి కుటుంబం పై బురద జల్లు తున్నారని బంగారు రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గారి మీద హత్య యత్నం వరదరాజుల రెడ్డి చేశారని , కామనూరు లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగకుండా కామనూరు లో ఉండే వైసిపి కార్యకర్తలను బెదిరింపులు చేస్తున్నారని, సొంత ఊర్లో ఎన్నికలు జరపకుండా అడ్డుకుంటున్న వరదరాజుల రెడ్డి అసలు దౌర్జాన్యపరుడు అని బంగారు రెడ్డి అన్నారు.