ప్రొద్దుటూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి తో ముప్పు ? | apnews | Proddatur Politics | Telugu Vartha
ప్రొద్దుటూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజులరెడ్డితో ముప్పు ? ఇటీవల వరదరాజులరెడ్డి తో కలసిన మాజీ మున్సిపల్ ఇంచార్జ్ చైర్మెన్ వి.ఎస్.ముక్తియర్ , అడ్వకేట్ ఇ.వి. సుధాకర్ రెడ్డిలకు హెచ్చరిక జారీ చేసారు కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవి. గతంలో వీరు ఇరువురి పై వరదరాజుల రెడ్డి కుటుంబ సభ్యులు దాడి చేసిన సంఘటనలు ఉన్నాయని, కిడ్నాప్ చేసి కొట్టిన కేసులు ఇప్పటికీ ఉన్నాయని, రాబోవు రోజుల్లో కూడా మళ్ళి వరదరాజుల రెడ్డి ఎన్నికల్లో ఓటమి తప్పదని ఆ ఓటమిని తట్టుకోలేక వరదరాజులరెడ్డి మళ్ళి ముక్తియర్, ఇ.వి.సుధాకర్ రెడ్డి ల మీద దౌర్జన్యం చేసే అవకాశాలు ఉన్నాయని గరిశపాటి లక్ష్మీదేవి అన్నారు.