చంద్రబాబుకు ఎన్నికలప్పుడే ముస్లీంలు గుర్తుకు వస్తారు | apnews | AP Mulims | TDP | Telugu Vartha
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుకు ఎన్నికల సమయం లో మాత్రేమే ముస్లీంలు గుర్తుకు వస్తారని కర్నూల్ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ ప్రెస్ మీట్ లో అన్నారు. చంద్రబాబు అధికారంలోకి రావడానికి ఎన్ని అపద్దలైన చెప్తారని, గతంలో బిజెపి పార్టీ తో పొత్తు పెట్టుకోనని బహిరంగ ప్రకటన చేశారని,
ప్రస్తుతం బిజెపి పార్టీతో పొత్తు కోసం డిల్లీలో చుట్టూ తిరిగి పొత్తు పెట్టుకున్నారని, ఇలా మాట తప్పే వ్యక్తిత్వం వలన రాజకీయ పార్టీలన్న వ్యక్తులు అన్న ప్రజల్లో చులకన భావం వచ్చిందని ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో కనీసం ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదని,
ప్రతి ఎన్నికల్లో ముస్లీం లకు తక్కువ సీట్లు కేటాయించ్చే వ్యక్తీ చంద్రబాబు అని అన్నారు . కేంద్ర ప్రభుత్వం ముస్లీం లకు వ్యతిరేకంగా అనేక చట్టాలను తెచ్చిందని , ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు కూడా ఎత్తేస్తామని ప్రకటనలు చేస్తున్నారని అలాంటి బిజెపి పార్టీ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్న వ్యక్తీ ముస్లీం ల వ్యతిరేకంగా గుర్తు పెట్టుకోవల్సినదిగా చంద్రబాబు ప్రవర్తన ఉందని ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ అన్నారు.
రంజాన్ తోఫా విలువ కేవలం 300 రూ/- మాత్రమే అవుతుందని అందులో కూడా నాణ్యత లోపించిన వస్తువులు సరపరా చేసే వారని, ఇలాంటి చిన్న చిన్న వాటితో సరిపెట్టే వ్యక్తీ చంద్రబాబు అని , చంద్రబాబు భజన చేసే ఈనాడు,ఆంధ్రజ్యోతి పత్రికలు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కించపరుస్తూ వార్తలు వ్రాయటం సరైన పద్దతి కాదని కర్నూల్ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ అన్నారు.
ఇవే కాకుండా ఆయన మరెన్నో ముఖ్యమైన విషయాలు ముస్లీం సమాజానికి ఉపయోగ పడే అంశాలను ప్రస్తావించారు , ఈ వివవరాలు వీడియో చుస్తే మీకు అర్థం అవుతాయి.